పొలిటికల్ ఎంట్రీపై తిరుగులేని క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
- రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసిన రామ్ చరణ్
- చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ కావడమే తన లక్ష్యమని వెల్లడి
- 'పెద్ది' తన కెరీర్‌లో ఎంతో నిజాయతీగా చేసిన చిత్రమని వ్యాఖ్య
- డూప్ లేకుండా స్టంట్స్ చేయడం తనకిష్టమని, తండ్రే స్ఫూర్తి అని వెల్లడి
- బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, సినిమా రంగంలో అగ్రస్థానానికి చేరడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"అభిమానులు మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు, మీరు రాజకీయాల్లోకి వస్తారా?" అన్న ప్రశ్నకు చరణ్ బదులిస్తూ.. "రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవడం లేదు. నా పూర్తి దృష్టి నటనపైనే ఉంది... నటనా రంగంలో మేటిగా నిలవడంపైనే నా దృష్టంతా!" అని అన్నారు.
తన కొత్త సినిమా ‘పెద్ది’ గురించి మాట్లాడుతూ, ఇది తన కెరీర్‌లో ఎంతో నిజాయతీగా చేసిన చిత్రమని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో, తన అస్తిత్వాన్ని వెతుక్కునే ‘పెద్ది’ అనే యువకుడిగా కనిపిస్తానని వివరించారు. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డానని చెప్పారు. క్రీడా నేపథ్య డ్రామాగా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రిస్కీ షాట్‌లలో డూప్‌ల సహాయం లేకుండా నటించడానికే ఇష్టపడతానని, తన తండ్రి చిరంజీవి 71 ఏళ్ల వయసులో కూడా స్టంట్స్ చేస్తున్నారని, అలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని రామ్ చరణ్ పేర్కొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.